
యాదగిరిగుట్ట శుక్రవారం, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. ఆలయ పండితులు జితేందర్ దంపతులకు ఆశీర్వచనాలు చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాటు జితేందర్ దంపతులకు రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శి సుబ్బురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. జితేందర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బంగారు తాపడం జరిగిన తీరును ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకొని బంగారు తాపడం పనులను చూసి ఎంతో సంబరపడిపోయానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ, జిల్లా అధ్యక్షులు సామల రవీందర్, ప్రధాన కార్యదర్శి వాజిద్ డొంకెన వెంకటేశం యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు ఉప్పునూతల రాజశేఖర్, మండల అధ్యక్షులు జార్తాళ రాజు, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ సేవా అధ్యక్షులు రంగా ఆంజనేయులు, యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షులు అంకం రాజు తదితరులు పాల్గొన్నారు.