రంగురంగుల రెక్కలతో అలికిడి
ఆత్మ మీద వాలింది
పేరు తెలవని పువ్వులుహొ
అంతరమంతా పూసినయి
ఏ రాగమో కాని కనికట్టు కట్టింది
నిద్ర కూడా మొగ్గ తొడిగింది
కలలో జారిపోయిన పట్టాగొలుసు
నీడ చాటుకు నిలబడ్డ దివ్య పాదానిది
నాలోకిచూసి సింగిడి సిగ్గు పడింది.
రాలిన ఆకు… ఆకాశంలా విస్తరించింది.హొ
అలుగు పద్యాన్ని మలుగు వింటుంటే
ఎలుగు వొచ్చి పోతుంది
వెన్నెల్ని మింగిన చేపలు
చెరువు నిండా నక్షత్రాలుహొ
ఒక తెడ నా ఛాతి మీదికి వొచ్చి
సిగ్గు పడుతుంది నేను వెన్నెల వేగునని
చీకటి రాత్రి చికాకుపడ్డది
భటువు కుదవపెట్టి పటువ కల్లు తాగితే
చందమామ చేతికి తగిలింది
రాత్రి ఒడ్డు మీద పడుకొని
ఆకాశంతో ముచ్చట పెడుతుంటే
చేపలు ఊ కొడుతున్నాయి
ఆ పక్క పేదరాశి పెద్దమ్మలా ఉంది పెద్దగుండు
చెరువు ఆకాశమో.. ఆకాశం చెరువో కాని
నా కళ్లు రెండు ఈదుతునే ఉన్నయి
జింక తపస్సుకు పులి ప్రత్యక్షమైనట్టు
చేపలు తిని బొల్లి కోడిహొబలిస్తే
బొల్లి కోడిని తిని బోయ బలిసిండు
బోయ రెక్కల కష్టం తిని
రామయ్య సేటు బలిసిండు
ఊత మీద ఊత పడ్డది
పిడకల గూడేనకాల మునిమాపు ముచ్చటకుహొ
మిణుగురులు దీపం పట్టినయి
కీచురాయి గొంతు మూగబోయింది
మాట మాట పేనవేసుకుంటుంటే
గాలి హొయలుబోయింది
పగలంతా పోంగ.. మిగిలింది గీ రాత్రే
పక్షి గూడు కుందేలు పొద
ఎవరు కొనగలుగుతారు గీ రాత్రి.. నాకూ అంతే
చెరువారనేహొదివ్య లోకం ఒకటి ఉంది
నా కళ్లల్లో దశ్యాల్ని
హదయం ఎక్కడికో తీసికెల్లింది
కొన్ని మైళ్లు నడిచినాంక
ఓ రంగుల వాగులో మునిగి తేలుతున్నహొ
– మునాసు వెంకట్, 9948158163