ఖేలో ఇండియాపై దిగ్గజ షట్లర్ జ్వాల గుత్తా
నవతెలంగాణ-హైదరాబాద్
సరికొత్త మార్పులు, ప్రణాళికలు, లక్ష్యాలతో రూపొందించిన ఖేలో ఇండియా స్కీమ్‌కు దీర్ఘకాలంలో భారత క్రీడా ముఖచిత్రాన్ని మార్చగల శక్తి ఉందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతక విజేత గుత్తా జ్వాల అభిప్రాయపడింది. 2026-31 కాలానికి రూపొందించిన ఖేలో ఇండియా ప్రణాళికలను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డిప్యూటీ డైరెక్టర్ హిమ బిందు ఆవిష్కరించారు. 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రణాళికలు రానున్న పదేండ్లలో భారత జట్లకు క్రీడాకారులను తీర్చిదిద్దటంపై దృష్టి నిలిపాయి. విద్య, క్రీడలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఖేలో ఇండియా ఎక్సలెన్స్, ఫీడర్ స్కూల్స్‌ను ప్రవేశపెట్టనుండగా.. రానున్న ఐదేండ్లలో టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం) విభాగంలో 30 వేల మంది క్రీడాకారులను, ఓవరాల్‌గా లక్ష మంది క్రీడాకారులను ఖేలో ఇండియా ప్రణాళికల్లో భాగంగా తీర్చిదిద్దనున్నారు. క్రీడా బడ్జెట్‌ను సైతం ఎనిమిది రెట్లు పెంచుతున్నట్టు సాయ్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ సోనీబాలా దేవి, సాయ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ముఖ చిత్రాన్ని మార్చగలదు
- Advertisement -
- Advertisement -


