శ్రీవారి కల్యాణోత్సవం..

Srivari Kalyanotsavam..నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వేంకటేశ్వర ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం ఆలయ కమిటీ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు నిత్య హోమము, బలిహరణము,  11.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవము, సాయంత్రం 6 గంటలకు శ్రీవారికి గరుడసేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, కమిటీ సభ్యులు ప్రభ దేవి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, రమణ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు
Spread the love