శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ కన్నుమూత

Founders of Shankara Netralaya
SS Badrinath passed awayచెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రొరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. కొన్ని రోజులుగా బద్రినాథ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. బద్రినాథ్‌ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారని, బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికలో ఉదయం 9:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు శంకర్‌ నేత్రాలయ ఒక ప్రకటనలో తెలిపింది. 1940 ఫిబ్రవరి 24న చెన్నైలో బద్రినాథ్‌ జన్మించారు. నగరంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని, 1962 మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి పట్టబద్రులయ్యారు. తరువాత అమెరికా వంటి దేశాల్లో మరింత ఉన్నత కోర్సు చదివి 1970ల్లో స్వదేశానికి తిరిగివచ్చారు. 1978 వరకూ వివిధ ఆసుపత్రుల్లో పనిచేశారు. 1978లో కంచి మఠం ఆచార్యులు జయేంద్ర సరస్వతి స్ఫూర్తితో డాక్టర్‌ బద్రినాథ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ విభాగంగా శంకర నేత్రాలయను స్థాపించారు. బద్రినాథ్‌కు 1983లో పద్మశ్రీ, 1999లో పద్మభూషణ్‌ అవార్డులు లభించాయి. కాగా, తన మరణం తరువాత భారీ ఏర్పాట్లు చేయరాదని, తనకు నివాళులర్పిస్తున్న కారణంగా శంకర నేత్రాలయలో ఒక్క నిమిషం కూడా పని ఆగకూడదనే బద్రినాథ్‌ ముందుగానే సూచనలు ఇచ్చారు.

Spread the love