నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ శుక్రవారం బాధితులకు ఎస్ ఐ వీరబాబు అందజేశారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అడిశర్ల పల్లి మండలం మాధా పురం గ్రామానికి చెందిన రమావత్ అఖిల్ గతకొద్దీ రోజుల క్రితం రెడ్ మీ సెల్ఫోన్ ను పెద్దవూర బాలుర గిరిజన హాస్టల్లో పోగొట్టుకున్నారు.ఇట్టి విషయం పై స్థానిక పెద్దవూర పోలీస్ స్టేషన్ లో సీఈఐఅర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయగా వారి మొబైల్ ఫోన్ ను గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకుని బాధితునికి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఆయన తెలిపారు.ఎవరైనా సెల్ పోన్ పోగొట్టుకున్నట్లయితే వివరాలను సీఈఐఅర్ ఫోర్టల్ నమోదు చేస్తే ఫోన్లను గుర్తించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా ఎవరికైనా మొబైల్ ఫోన్లు దొరికితే వాటిని వెంటనే పోలీస్ స్టేషన్ లో అందించాలని ఎస్సై కోరారు. మొబైల్ తిరిగి తన చేతికి వచ్చినందుకు సిఈఐఆర్ పోర్టల్ చాలా ఉపయోగపడిందని తిరిగి మొబైల్ ను ఎస్సై చేతుల మీదుగా తీసుకోవడంతో బాధితుడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.