ఘనంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాధ వృద్ధుల,వికలాంగుల ఆశ్రయములో ఘనంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు అన్నారు.గురువారం భవిష్యత్తు తరాలకు ఆశాకిరణం, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే యువ నాయకుడి జన్మదిన సందర్భంగా ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎస్ కె. రషీద్, కోమటిరెడ్డి నర్సిరెడ్డి, పద్మా రెడ్డి, దేశగాని సతీష్, నాగిరెడ్డి,కొంపల్లి ప్రశాంత్ యాదవ్,కొరవి గంగయ్య, పోలోజు మహేష్, నర్సిరెడ్డి, సురేష్ నాయక్, నరేష్, రాజశేఖర్,నవీన్ పాల్గొన్నారు.
Spread the love