కొత్తూరు పాఠశాలకు రాష్ట్ర స్థాయి అవార్డ్

నవతెలంగాణ – రాయపర్తి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డు వివిధ విభాగాలలో అవార్డులను ప్రధానం చేయగా విద్యాశాఖ విభాగంలో మండలంలోని కొత్తూరు పాఠశాల ప్రథమ బహుమతికి ఎంపిక కాగా ఐఏఎస్ ఏ వాణి ప్రసాద్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఈఆఫ్ఎస్టి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోముల రంగయ్య, నేషనల్ గ్రీన్ కోర్ ఇంచార్జ్ ఉపాధ్యాయురాలు కొంక అనురాధ అవార్డును అందుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితోనే పాఠశాలకు అవార్డు వచ్చిందని తెలిపారు. గ్రామస్తుల సహకారం మరువలేనిది అని పేర్కొన్నారు.
Spread the love