బాన్సువాడలోనే ఉంటా..

– భయపడి కాంగ్రెస్ లోకి పోచారం 
– అధిష్టానం ఆదేశాలకు గౌరవించాలి..
– మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కంచుకోటకు కాంగ్రెస్ పార్టీ బీటలు వేసిందని, నేను బాన్సువాడ లొనే ఉంటానని కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. శనివారం బాన్సువాడ పట్టణంలో ఏనుగు రవీందర్ రెడ్డి నివాసం వద్ద ఏనుగు రవీందర్ రెడ్డి  వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం  ఇంటికి వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం వెనుక ఏదో కారణం ఉంటుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ను అందరం గౌరవించాలన్నారు. పార్టీకో, ప్రభుత్వ నికో ఏదో లాభం ఉండడం చేతనే  పోచరంను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పోచారం కు కంచుకోటలాగా ఉండగా ఎంపీ ఎన్నికల్లో పోచారం కోటకు కాంగ్రెస్ పార్టీ బీటలు వేయడంతో బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి భయపడి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని. ఎవరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగే నష్టం ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటింది ఇందులో ఎవరైనా రావచ్చు  నన్ను నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులకు తాను అండగా ఉంటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్‌ నాయకులందరు కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలు బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
Spread the love