నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..

నవతెలంగాణ – బొమ్మలరామారం

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ దేవ్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు చీకటిమామిడి, మర్యాల, గ్రామాల్లో విత్తన దుకాణాలను ఆయన ఆకస్మితంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విత్తన రసీదులు, ఇన్వాయిస్ లు, స్టాక్ రిజిస్టర్లను ను పరిశీలించారు.విత్తన ప్యాకెట్లపై వివరాలు లేకపోతే వాటిని అమ్మవద్దని,విత్తనాలు స్టాక్ ధరలను స్టాక్ బోర్డుపై నమోదు చేయాలిని షాపుల నిర్వాహకులకు సూచించారు. విత్తనాలు ఎక్కువ ధరలను అమ్మితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోచంపల్లి ఎంపీ ఓ ఖాన్, ఏఓ పద్మ, పోలీస్ సిబ్బంది యాదగిరి, నవీన్, దుకాణాల యజమానులు పాల్గొన్నారు.
Spread the love