
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్జి జిల్లాలో కల్తీకల్లు దుకాణాల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వడ్ల సాయికృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య సుమారు 64 కు చేరిందని ఇందులో కొంతమంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. నిషేధిత మత్తు పదార్థాలు కల్లులో కలపడంతోనే బాధితులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తున్నదని ఆయన అన్నారు. ఈ విషయంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ విభాగం అధికారులు, వైద్య శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అట్టి కల్తీ కల్లు దుకాణాలను సీజ్ చేయాలని, నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. దీనిపై మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర రిపోర్టు పంపనున్నట్లు ఆయన తెలిపారు.