అర్హత క్వాలీఫ్ కేషన్ లేని వారు శస్త్ర చికిత్సలు చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్ఓ

Strict action if unqualified persons perform surgeries: DMHOనవతెలంగాణ – పెద్దవూర
అర్హత క్వాలీఫ్ కేషన్ లేనివారు రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆరోగ్య అధికారి  పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పరిశీలించారు. ఈసందర్బంగా విలేకరుల సమావేశం మాట్లాడారు. ప్రతి జ్వరం డెంగ్యూ కాదని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.పల్లెదవాఖానాల్లో తేలుకాటు, పాముకాటు మందులతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారుప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధికారి ఆదేశించారు.కొంతమంది ఆర్ఎంపీ లు, పీఎంపీ లు, బీహెచ్ఎంఎస్ లు, బీఎంఎస్ లు నఖిలీ సర్టిఫికెట్లు సంపాదించి నర్సింగ్ హోంలు, సంతాన సాపల్య కేంద్రాలు, ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చలగాట మాడుతున్నారని అన్నారు. క్వాలీ ఫై లేనివారు రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, నిర్వహిస్తూ న్నారని, తప్పుడు సర్టిఫికెట్ ల తో మెడికల్ షాపులు, ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేసుకొని రోగులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కృష్ణపట్టే ప్రాంతాలైన నాగార్జున సాగర్, దామరచర్ల లో చికెన్ గున్యా,డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.సిబ్బంది సమయ పాలన పాటించాలని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఆసుత్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నగేష్, మిర్యాలగూడ డివిజన్ అధికారి కేసరవి,సీహెచ్ఓ శ్రీనివాస్,నర్సింగ్ అధికారులు రజిత, నిర్మల, ఝాన్సీ, సీనియర్ అసిస్టెంట్ వసుధ శ్రీ, ఫార్మాసిస్టు రంజిత్ కుమార్ ఉన్నారు.
Spread the love