మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై ఆంజనేయులు

నవతెలంగాణ – గాంధారి
గాందారి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల కాలం లో మన గాందారి మండలం లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఆత్మరామ్, కైతి సాయిలు, గడ్డం శంకర్, మంజ గోవింద్, ఓడుసుల సాయిలు లను  గాందారి పోలీసులు  పట్టుకొని మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో కేసు నమోదు చేసి ఎల్లారెడ్డి కోర్ట్ ముందు హాజరు పరుచగా, కోర్టు  వారు జరిమానా వేసి మరియొక సారి మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష విధించబడును అని హెచ్చరించనైనది.  కావున మద్యం తాగి వాహనాలు నడపకూడదని గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు గాంధారి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Spread the love