స్టూడెంట్ మిత్ర (కెరీర్ గైడన్స్ బుక్లెట్)ఆవిష్కరించిన డాక్టర్ ర్యాకల శ్రీనివాస్…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్ ఎస్ కె ఫౌండేషన్ అధినేత, సామాజికవేత్త డా॥ ర్యాకల శ్రీనివాస్ సౌజన్యంతో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం “స్టూడెంట్ మిత్ర (కెరియర్ గైడెన్స్ బుక్లెట్)” అనే ఒక పుస్తకాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పూర్తిచేసిన వెంటనే ఉన్నత చదువుల కొరకు, ప్రతి విషయాన్ని క్లుప్తంగా బుక్లోట్లో పొందుపరిచిందని తెలిపారు రూపొందించబడిన కెరీర్ గైడెండ్స్ బుక్లెట్ దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వారందరికీ ఈ బుక్లెట్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిహెచ్ రంగరాజన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పి లావణ్య, ఆర్ ఎస్ కే ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love