ఘనంగా విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం 

Students' Self-Government Day celebratedనవతెలంగాణ – తాడ్వాయి 
తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సోలం కృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలతోటి, విద్యార్థులకు బోధన చేశారు. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా, ఉపాధ్యాయులుగా మిగతా విద్యార్థులు వ్యవహరించి వారి అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సోలం కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులను సమాజాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుని పాత్ర అనిర్వచనీయమైందని తెలిపారు. నిజజీవితంలో కూడా సమాజానంలో ఏ విధంగా ఉండాలని విషయంలో సీఈ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందని తెలిపారు. విద్యార్థులు అందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మజ, కవిత, రాజబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love