జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచర్ల జిల్లాపరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి పోటీల్లో ఎడ్లపల్లి మెడల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై నట్లుగా ప్రిన్సిపాల్ పుర్ణచందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదవ తరగతికి చెందిన సీహెచ్ వైష్ణవి, 9వ తరగతికి చెందిన మానస్వీని, 8వ తరగతికి చెందిన వీ.హాని జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నట్లుగా తెలిపారు.