విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

Students should be seen without difficulties– మోమిన్‌ఖుర్ద్‌లో పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ
నవతెలంగాణ-ధారూర్‌
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ నరసింహులు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మోమిన్‌ కుర్దు ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్మ ఆదర్శ పనుల్లో భాగంగా పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయులు వీరప్ప, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్‌ మణెమ్మ, పాఠశాల మాజీ చైర్మెన్‌ శ్రీనివాస్‌, అంగన్‌వాడీ టీచర్‌ రాధ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love