విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

– నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ 
నవతెలంగాణ –  కంటేశ్వర్
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి వివేకానంద ఉన్నత పాఠశాలలో జరిగిన 25 వ వార్షికోత్సవం(సిల్వర్ జూబ్లీ) లో నగర మేయర్ దండు నీతూ కిరణ్, అతిథులు జయరామ్  అడిషనల్ డిప్యూటీ కమిషనర్, సుదీర్ కుమార్  మోటివేటర్   ఇందిరా వినోద్ కార్పొరేటర్, అశోక్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ జయరాం మాట్లాడుతూ..పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందు ఉండ్డలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నారా గౌడ్, ప్రిన్సిపల్ లతా, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love