విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ- తుంగతుర్తి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మేరీ మదర్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ మేరకు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని, అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ లో రాణించిన వారికి ప్రత్యేక అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ జెండాను ఎగరవేసి, క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మేరీ విజ్జి, మేనేజర్ సిస్టర్ అలేసియా, సిస్టర్ హెలెన్, సిస్టర్ జ్యోతి, సిస్టర్ మరియ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బోనగిరి సోమన్న, పేరెంట్స్ కమిటీ మెంబర్ యాకూబ్, స్టాఫ్ సెక్రటరీ అనిత, పి ఈ టి శంకరయ్య, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love