విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేయాలి… 

– జూన్ కల్లా తయారుచేసి అందజేయాలి..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీ జూన్ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో డిఇఓ, డిఆర్డిఏ, సంక్షేమ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల స్టిచ్చింగ్ పై నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ప్రకారం విద్యార్థుల కొలతలతో జూన్ నెలలో పాఠశాలలో ప్రారంభం అవుతాయి కావున అన్ని పాఠశాలలకు ఏకరూప దుస్తులు తయారుచేసి అందించే విధంగా ఏపిఎంలు, సీసీలు కృషి చేయాలన్నారు. పాఠశాలల సంఖ్య ,పాఠశాలలకు కేటాయించిన ఎస్ హెచ్ జి గ్రూపుల వివరాలు, విద్యార్థుల సంఖ్య తెలుపుతూ ఒక నివేదికను అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల వారీగా రిజిస్టర్ పెట్టి నమోదు చేసి ఎకనాలెడ్జి తీసుకున్న తర్వాతనే క్లాత్ అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి కుట్టు కేంద్రంలో పదిమంది మహిళలు దుస్తులు తయారు చేసే విధంగా వారికి కాజా మిషన్స్, బటన్స్ కుట్టే మిషన్ కటింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో ఎకరూప దుస్తుల తయారీకి ఎన్ని కుట్టు మిషన్లు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతికి దుస్తుల తయారీ ఇవ్వవద్దన్నారు, మహిళా సంఘాలు మాత్రమే ఎకరూప దుస్తులు తయారు చేయాలన్నారు. నిర్దేశిత గొడువు లోగా ఏకరూప దుస్తులు అందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 37 కేంద్రాలు ఉన్నాయని మొత్తం 475 మంది ట్రైనర్స్ సిద్ధంగా ఉన్నారని ఐపిడి రామ్ సురేష్ తెలిపారు. అలాగే అన్ని మున్సిపాలిటీలలో కూడా సంఘాలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఏకరూప దుస్తుల తయారీ చేయాలని మెప్మా పిడి రేణుకకు కలెక్టర్ ఆదేశించారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే లోపుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించే విధంగా రూపకల్పన చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ నరసింహ రావు ,డి ఈ ఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్ ,లత. డిపిఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
Spread the love