నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విద్యార్థులు పోటీ పరీక్షలకు లైబ్రరీ లను సద్వినియోగం చేసుకోవాలని బి ఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లైబ్రరీకి బి యన్ రావు ఫౌండేషన్ స్టడీ మెటీరియల్, పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా బి.ఎన్.రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు విద్యార్థులు సరైన అవగాహన ఏర్పరచుకోవాలని తెలిపారు. లక్ష్యం ఏర్పరచుకొని క్రమశిక్షణతో సిద్ధమైతే ఎలాంటి లక్ష్యమైన సద్యమవుతోందన్నారు. మన దేశంలో చదువుకున్న యువత ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎక్కువగా ఉందని దానికి సమాంతరంగా ఉద్యోగ కల్పన కూడా ఉండాలన్నారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో నిరుద్యోగశాతం ఎక్కువగా ఉండి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో ఇప్పటికిప్పుడు 11 కోట్ల ఉద్యోగాలు ఖాళీగ ఉన్నాయన్నారు.కాలేజీలో నుంచే అప్రెంటిషిప్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఐటిఐ లో టెక్నాలజీ పెంపొందించి కాలేజీ,యూనివర్సిటీలో లలో అధిక మొత్తంగా నిధులు కేటాయించాలన్నారు. చదువుకున్న యువతే ఈ దేశానికి మానవ వనరులు అన్నారు. అభివృద్ధి జరిగితే ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతి చదువుకున్న యువతకి ఉద్యోగం కల్పించాలని నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలన్నారు. ఇది ప్రభుత్వం యోక్క ప్రాథమిక భద్యత అని డాక్టర్ బి ఎన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళి, అడ్వకేట్ దినేష్ పాల్గొన్నారు.