విద్యార్థులు చెడు వ్యసనాల జోలికి వెళ్ళకూడదు

– ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసుల అవగాహన కార్యక్రమములో ఎస్ఐ: వంశీ కృష్ణ రెడ్డి  
నవతెలంగాణ – ధర్పల్లి 
విద్యార్థులు తమ భవిషత్తును దృష్టీలో పెట్టుకొని పైచదువులపైనే  దృష్టి సాధించాలని ధర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణ రెడ్డి అన్నారు. శుక్రవారము అయన మండలకేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమములో అయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిషత్తు అనేది ఇంటర్ విద్యతోనే మొదలవుతుందని దీన్ని సరైన మార్గంలో  విద్యార్థులు వెళ్ళినట్లైతే వారి భవిషత్తు బాగుపడుతుందని అన్నారు. ఈదశలోనే చెడు మార్గాలు,చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయని అన్నారు. అందుకే ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సరైన మార్గంలో నడిచి శ్రద్ధతో విద్యాభ్యసము కొనసాగించి ఉన్నత చదువులు చదివితే విజయాలు తప్పకుండ మీకు వెతుక్కుంటూ వాటికవే వస్తాయని అన్నారు.కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ అస్లాం రిజివి,కళాశాల సిబ్బందితో పాటు పొలిసు సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love