ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్నిట్లో రాణిస్తారు..

నవతెలంగాణ – తొగుట 
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్ని ట్లో రాణిస్తారని మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మండ లంలోని చందాపూర్ ప్రభుత్వ పాఠ శాలలో 2024-25 విద్యా సంవత్సరాన్ని ప్రారం భిస్తు తెలంగాణ ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్త కాలు, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులను పాఠశాల అమ్మా ఆద ర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ, ప్రధానోపా ధ్యాయులు గరిపల్లి సిద్ధేశ్వర్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ రాజు కలిసి విద్యార్థులకు అంద జేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవ త్సరం పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు సకా లంలో అందించారని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉంటాయని అన్నా రు. చందాపూర్ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఉపన్యాసాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఒక విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా నిలబడు తారని తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో పాఠ శాల సహోపాధ్యాయులు రాంబాబు, అరుణ, గంగా, సతీష్ కుమార్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love