నవతెలంగాణ – మంథని
ఈనెల 10న ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ లో వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనన్ని విజయవంతం చేయాలని మంథాని గీత పరిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మాచిడి సత్యనారాయణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు తెలిపారు.