నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన బాల్ నర్సయ్యకు కాలులో రక్తప్రసరణ జరగక, కాలు తీసీవేసే పరిస్థితిలో తన దగ్గరకు రాగా స్టెంటింగ్, యాంజియోప్లాస్టీతో సహా సమర్థవంతమైన వాస్కులర్ సర్జరీని చేసీ కాలును తొలగించకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు యశోద హాస్పిటల్స్ ప్రముఖ వాస్కులర్ సర్జన్ డా. ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చాలామంది వ్యాయామం చేయడం లేదని, గంటల తరబడి కూర్చొని కానీ, నిలబడి కానీ పనిచేస్తున్నారని వాటి మూలంగా రక్తప్రసరణ జరగక అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం యశోద హాస్పిటల్స్ ద్వారా ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చేర్యాలకు చెందిన బాల్ నర్సయ్య (67)కు తీవ్రమైన ఎడమ కాలు నొప్పి, వాపు మరియు పుట్ అల్సర్ వంటి గాయాలతో బాధపడుతు అనేకమంది వైద్యుల వద్దకు వెళ్లాడని తెలిపారు. నయం కాకపోవడంతో తమ వద్దకు వచ్చాడని, వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జన్, డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ నేతృత్వంలో ఆయనను పరిశీలించి రక్త ప్రసరణ జరగడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళిక, నిర్థారనతో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగామనీ తెలిపారు. ప్రజలు రోజు వ్యాయామం చేస్తే కొన్ని రకాల రోగాలను నియంత్రించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి ప్రతినిధి రాజిరెడ్డి, సురేష్, బాల్ నర్సయ్య పాల్గొన్నారు.