నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో ఆదివారం రోజున మాజీ ఎంపీపీ ఆదివాసి గిరిజన చైర్మన్ కితవత్ యాదగిరి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి మా గిరిజన ఆదివాసిల తరపున ప్రత్యేక విన్నపాన్ని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకి మంత్రివర్గంలో చోటు లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధి కూడా కొంతవరకు కొంత పడుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయో సమయంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు మరియు ఒక స్పీకర్ పదవి ఇచ్చి రాష్ట్రంలోని జిల్లాకు ప్రముఖ స్థానంలో ఉంచారు. ఆ సమయంలో జిల్లా అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని పురోగతి సాధించింది. మరి రాష్ట్రంలో జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మాంత్రిగా ఉన్న సమయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 21- 22 ప్యాకేజీ పనులు వేగవంతంగా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న నిజామాబాద్ పట్టణానికి త్రాగునీటి సౌకర్యం కోసం గతంలోని అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలకు త్రాగునీరు అందించారు.
అదేవిధంగా ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ నగరం నడి ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, జనరల్ హాస్పిటల్ ను అభివృద్ధి చేశారు. ఇంత అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ క్యాడర్ నీ కాపాడుతూ జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మంత్రి పదవిగా చేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేనీ నిజాయితీగల నాయకుడు సుదర్శన్ రెడ్డి అని, తాను ఇప్పుడు తప్పు చేయడు, తప్పు చేస్తే క్షమించడు ముక్కుసూటి మనిషి అని, ఎల్లప్పుడూ అవినీతికి, ఆర్భాటాలకు దూరంగా ఉండే వ్యక్తిఅని కావున ఇంత సీనియర్ మరియు అనుభవం ఉన్న నాయకుడికి త్వరగా మంత్రి వర్గంలో స్థానం కల్పించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమంలో ముందుకు తీసుకొని పోయే విధంగా చూడాలని ఇట్టి సమావేశం ద్వారా ప్రభుత్వ పెద్దలకు పార్టీ నాయకులకు నిజామబాద్ జిల్లా ఆదివాసి గిరిజన చైర్మన్ కేతావత్ యాదగిరి పత్రికా ముఖగా విన్నవించడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ తారాచన్ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రనాయక్ మోపాల్ మండల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి, మాజీ ఎంపీటీసీ వెంకట్రామ్, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బున్నే రవీందర్, ధర్మారం మాజీ సర్పంచ్ గంగారం మరియు బంజారా సోదరులు పాల్గొన్నారు.