మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్..

నవతెలంగాణ – మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సుజాతా సౌనిక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సీఎస్ గా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Spread the love