ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది సుంకే సవిత రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 26,27 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగిన ఐలు రాష్ట్ర మహాసభలలో సవిత ఎన్నికైనట్లు తెలిపారు. రానున్న కాలంలో మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఈ సందర్బంగా ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకే సవితారాణిని పలువురు న్యాయవాదులు అభినందించారు.