కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర 

– పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ 
నవతెలంగాణ – పెద్దవంగర: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి గరిష్ట మద్దతు ధర పొందాలని తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ అన్నారు. చిట్యాల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు.‌ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న వడ్లకు రూ.500 చెల్లిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, తోటకూరి శ్రీనివాస్, రావుల వెంకట రంగారెడ్డి, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ధరావత్ శంకర్ నాయక్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వల్లపు లావణ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్, శ్రీధర్, యూత్ నాయకులు మహేష్, రజినీ కాంత్, రాంచరణ్ తేజ్, బాలాయ్య, సోంమల్లు, యాకయ్య, పీఏసీఎస్ సీఈవో మురళి, సిబ్బంది యాకయ్య, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love