నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్స్ నారోకు విధించిన జైలు శిక్షను తగ్గించే చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ చేపట్టేవరకు, ఈ చట్టాన్ని నిలిపివేయాలని శనివారం జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్ ఆదేశించారు. 2022లో వామపక్ష అభ్యర్థి లూలా డ సిల్వా చేతిలో ఓడిపోయిన బోల్సెనారో పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్ లో 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ డిసెంబర్ లో కుట్రలో దోషులుగా తేలిన బోల్సెనారో సహా ఇతరులకు శిక్షను తగ్గించేలా కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా జనవరిలో ఈ బిల్లును వీటో చేశారు. కానీ ఏప్రిల్ చివరలో కాంగ్రెస్ నిర్వహించిన ఓటింగ్ లో ఈ వీటో వీగిపోయింది. అనంతరం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని , దానిని రద్దు చేయాలని బోల్సెనారో మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బోల్సెనారో శిక్ష తగ్గింపు చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -



