నవతెలంగాణ-నాచారం
నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తికాగా, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాలనీలోని మంచినీటి పైపులైన్లు సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఉండటంతో పనుల అమలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొత్త మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను విన్న వెంటనే ఎమ్మెల్యే జలమండలి జనరల్ మేనేజర్ సంతోష్‌తో మాట్లాడి, తక్షణమే కొత్త పైపులైన్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల శేఖర్ గౌడ్, సంఘం యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లింగం యాదవ్, ప్రవీణ్, సాయి జెన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్ర నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు ఆటంకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



