Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం..

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం..

- Advertisement -

 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణంలో భువనేరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు  ఘన స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయాల అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా – బాబురావు, మండల  గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -