భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం శివారులోని న్యూ డైమెన్షన్ పాఠశాలలో జాబ్ మేళా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రధాన మంత్రిగా మోదీ మూడవ సారి ఎన్నికైన తర్వాత తెలంగాణకు తొలి సారి రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మోదీ ప్రయాణిస్తున్నారు.భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ ఎకానమీ కావలనేది మోదీ ఉద్దేశ్యం అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా తెలంగాణ ఏకానమీని 3 ట్రిలియన్ ఎకానమీగా చేయాలని నిర్ణయం తీసుకున్నారని,
వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ ను అనుసంధానం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని,కేంద్ర మంత్రులను కలిసి ట్రిపుల్ ఆర్,ఫ్యూచర్ సిటీ,మెట్రో ఫెజ్ 2,మూసీ పునరుజ్జీవంపై మాట్లాడారని, విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాన మంత్రి మోడీని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,భద్రాచలం వద్ద ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశంపై మోడీ స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. క్యాబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉంద
నారు. మోదీ పెద్ద బీసి నాయకుడని బీజేపీ ప్రచారం చేస్తోంది.పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో తెలంగాణ బీసీ బిడ్డలకు మోదీ సమాధానం చెప్పాలని కోరారు. కేంద్రం జనగణనలో కులగణన ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
డీలిమిటేషన్ బిల్లు,మహిళా రిజర్వేషన్ల బిల్లు కలిపి పెట్టి ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం అన్నట్లు మాట్లాడారు. మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు.2026 జనాభా లెక్కల తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టలేదని, దీనిపై మోడీ సమాధానం చెప్పలేదనారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తామనారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీ స్పందించాలని కోరారు.



