Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంసీజేపీ ఆందోళనలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ గత నెల జూలై 20న కాక్రోచో జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనలో పాల్గొన్న యువతపై ఢిల్లీ పోలీసులు కేసులు బనాయించారు. ఈ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాకుండా ఈనెల 5న కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ సీజేపీ మరో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈక్రమంలోనే సుప్రీంకోర్టు నుంచి కీలక నిర్ణయం వెలువడింది. యువతపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే నేర చరిత్ర కలిగిన వ్యక్తుల విషయంలో మినహయింపు ఉంటుందని వెల్లడించింది.

జంతర్ మంతర్ ఆందోళనలో నిరసకారులపై, పోలీసులపై నమోదు చేసిన అన్ని కేసులను రద్దు చేయాలని సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకు ఆర్టికల్ 142 ద్వారా ఉన్నత న్యాయస్థానానికి సర్వ హక్కులున్నాయని పిటిషన్ లో పేర్కొంది. ఈక్రమంలోనే సుప్రీంకోర్టు సదురు ఎఫ్ఐఆర్ లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -