- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
కొత్త పెన్షన్ వద్దు.. పాత పెన్షనే ముద్దు అనే నినాదంతో మంగళవారం మండల కేంద్రంలోని టీజీ సిపి ఎస్ఇ యు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 ఉద్యోగుల పాలిట చీకటి దినమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు జేఏసీ మద్నూర్ కామారెడ్డి జిల్లా అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపాల్ షెల్కె పాండురంగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కె లక్ష్మణ్, ఫహీం, సంఘీభావం తెలిపారు.
- Advertisement -



