నవతెలంగాణ-మద్నూర్
మండల వ్యవసాయ అధికారి రాజు, కేవీకే రుద్రుర్ శాస్త్రవేత్త ఇందుధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మేనూర్ రైతు వేదికలో నూనె గింజల ఆయిల్ ఫామ్ సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పథకం ద్వారా సోయాబీన్ రకం డి ఎస్ బి -34, ఎం ఏ సి ఎస్ -1460 రకం వాటిపై సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు.
అదేవిధంగా రైతులకు నానో డిఏపీ ని పంపిణీ చేశారు. అనంతరం సోయాబీన్,ఆయిల్ ఫామ్ సాగు పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్కజీ, ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్, ఏఈవో విశాల్ గౌడ్, రాజహిత, రైతులు గోపాల్, భీమ్ రావు,నాగ్నాథ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
నూనెగింజల ఆయిల్ ఫామ్ సాగుపై శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



