Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలుపై సింగిల్‌ బెంచ్‌ గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎత్తివేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు సామాజిక, ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయని కోర్టుకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -