Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ నోటీసులపై ప్రజలు ఆందోళన చెందవద్దు

సర్ నోటీసులపై ప్రజలు ఆందోళన చెందవద్దు

- Advertisement -

–  మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జారీ చేస్తున్న ఎస్‌ఐఆర్ (SIR) నోటీసులపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌ఐఆర్ నోటీసులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను సరిపోల్చే క్రమంలో పలువురికి నోటీసులు అందుతున్నాయని తెలిపారు. చిన్నపాటి పొరపాట్లు, అక్షర దోషాలు ఉన్నా కూడా నోటీసులు జారీ అవుతున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు కంగారు పడకుండా, తమ వద్ద ఉన్న తగిన ఆధారాలను బీఎల్‌ఓలకు సమర్పించి సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ప్రజలకు పూర్తి వివరాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు అంజాద్, కాళ్ల గణేష్, రామ్మోహన్, కోఆప్షన్ సభ్యుడు ముబాషీర్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -