- Advertisement -
నవతెలంగాణ-హైద్రాబాద్ బ్యూరో : డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. నల్ల రంగు దుస్తులు ధరించి ప్లకార్డులు పట్టుకొని సచివాలయంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. పి ఆర్సీ వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాట పెన్షన్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్, ఉమెన్ వెల్ఫర్ అసోసియేషన్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామంలో ఉద్యోగులు నిర్వహించిన నిరసన ర్యాలీలో వందల సంఖ్యలో సచివాలయం, లోక్‌భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -



