- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని విమానం ఓ ఇంజిన్ లో టెక్నికల్ సమస్య ఏర్పడంతో పైలట్లు అత్యవసరంగా గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానం (6E 2102) ఢిల్లీకి బయల్దేరింది. గాల్లో ఉండగానే విమానం రెండు ఇంజన్లలో ఒకటి ఫెయిల్ అయినట్లు గుర్తించిన పైలట్లు ATC కి సమాచారం ఇచ్చారు. ఎటీసీ అధికారుల ఆదేశాలతో గోవా ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
- Advertisement -



