Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌ దాఖలు చేశారు. వివాదాస్పద భూమిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా జస్టిస్‌ జూకంటి అనిల్‌ కుమార్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు ఉండటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను ముగిస్తూ.. ఆయనను కమిషనర్‌ బాధ్యతల నుంచి బదిలీ చేసి మరో అధికారిని నియమించాలని సీఎస్‌కు సింగిల్‌ జడ్జి సూచించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రంగనాథ్‌ అప్పీల్‌ చేయడంతో కోర్టు స్పందనపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -