Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంరష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి

రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా చేరిన భారతీయుల విషయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీరిలో 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. ఇప్పటివరకు మొత్తం 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు గుర్తించగా, వారిలో 139 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొంటున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ.. “ఈ అంశంపై రష్యా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నాం. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మిగిలిన భారతీయులను వీలైనంత త్వరగా విడిపించి, వారి కుటుంబాల వద్దకు చేర్చడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. పలు దఫాలుగా, వివిధ స్థాయిలలో ఈ అంశాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -