Tuesday, September 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో భారీ వరదలు..ఒకే ఇంట్లో 23 మృతదేహాలు లభ్యం

నేపాల్‌లో భారీ వరదలు..ఒకే ఇంట్లో 23 మృతదేహాలు లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం నాటికి నేపాల్‌లో 962 మంది మృతి చెందగా, 4,000 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నువాకోట్ జిల్లాలోని ఓ ఇంట్లో ఏకంగా 23 మృతదేహాలు లభించడం విషాదాన్ని మరింత తీవ్రం చేసింది. వరదల కారణంగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. పలు సొరంగాల్లో వందలాది మంది కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తుండటంతో నేపాల్ సైన్యం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -