– మండల విద్యాధికారి జి.శారదా
నవతెలంగాణ – మర్రిగూడ
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఎస్ జి ఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడా పోటీలు సెప్టెంబర్ 2 సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్,సెప్టెంబర్ 3న జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు నిర్వహిస్తున్నట్టు మండల విద్యాధికారి జి శారదా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.విద్యార్థుల క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం,ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ఉన్నత స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయడమే ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశం అన్నారు.విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నారని,మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వ్యాయామ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థులను నిర్దేశిత సమయానికి తీసుకువచ్చి,క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఎస్జిఎఫ్ క్రీడా పోటీలు
- Advertisement -
- Advertisement -



