Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 

నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 2027-2028 విద్య సంవత్సరంలో 9,11వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. ప్రస్తుతం 8,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,11వ తరగతిలలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 10 వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.నోటిఫికేషన్ ప్రకారం కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విధ్యార్థులకు 75 శాతం సీట్లను భర్తీ చేయనున్నట్టు విద్యాలయ ప్రిన్సిపల్ సీతా రాంబాబు తెలిపారు.ఇట్టి అవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -