Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రములోని కొందుర్గు రోడ్డులో నూతనంగా ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలకు విద్యుత్‌ లోఓల్టేజీ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడి టీవీ లు, ఫ్యాన్ లు, రిఫ్రిజిరేటర్ లు కాలిపోయి, ఆర్థికంగా నష్టానికి గురువుతున్నామని స్థానిక ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వెంటనే నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి, విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని స్తానికులు ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హజహర్ అలీ జుంటిపల్లి అంజయ్య, మహేష్ కిరణ్ రవి సురేష్ మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం నాయక్ సంబంధించిన ఎలక్ట్రీసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ కు జారీ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -