సూర్యాపేట జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

– గౌరవ అధ్యక్షులుగా ఎలుగూరి పాండుగౌడ్
నవతెలంగాణ – సూర్యాపేట
సూర్యాపేట జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నూతన కమిటీ నీ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హల్లో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు కొప్పుల వెణా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ  నాణ్యమైన మెటీరియల్ తో భవన నిర్మాణాలు చేపట్టి యజమానుల మన్ననలు పొందాలని తెలిపారు. సంఘ సభ్యులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించు కోవాలన్నారు. ఏ సమస్య వచ్చిన తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గా ఎల్గురి పాండు గౌడ్, అధ్యక్షులుగా కాసర్ల చంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం పాటీ జానయ్య కోశాధికారిగా పాతూరి మణిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పన్నాల ఉపేందర్రెడ్డి బరిశెట్టి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా షేక్ సలీం లచ్చే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు వరిపల్లి శంకర్, బిక్షపతి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love