అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలిని చెప్పండి స్వామి

– పండగ రోజు కూడా సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు
– సమ్మె శిబిరంలో వినాయక చవితి వేడుకలు
– న్యాయమైన కోరికలను తీర్చమని కేసీఆర్ కి చెప్పండి స్వామి
నవతెలంగాణ -కల్లూరు
వినాయక వినాయక చవితి పర్వదినం రోజు కూడా తమ బతుకులు మార్చుకోవాలని అందుకు కేసిఆర్ మనసును మార్చాలని సమ్మె శిబిరంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు పండగ జరుపుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ జరుపుకుంటుంటే అంగన్వాడీలు మాత్రం తమ బ్రతుకులు మారాలంటూ సమ్మె శిబిరంలోని వేడుకలు జరుపుకొని బొజ్జ గణపయ్యను వేడుకున్నారు.
అంగన్వాడి టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మె సోమవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో బొజ్జ గణపయ్య, విగ్రహం ఏర్పాటు చేసి అయ్యా సమస్యను పరిష్కారం చేసేటట్టు కేసీఆర్ తెలియజేస్తామని, పూజాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 8 రోజుల నుండి సాగుతున్న సమ్మెను కనీసం పట్టించుకోకుండా, అంగన్వాడి ఆడబిడ్డలతో చెలగాటమాడుతున్నారని, పండగ రోజు ఆడబిడ్డల కళ్ళంబటి నీరు తిరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన మూల నుంచి వస్తుందని, తక్షణమే యూనియన్ నాయకులను పిలిచి చర్చలు జరపాలని కేసీఆర్ కు ఆయన మనవి చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు అడిగే కనీసమైన కోర్కెలు తీర్చడానికి ప్రభుత్వం ఎందుకు ఎనకాడుతుందో అర్థం కావడం లేదన్నారు , కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం ప్రకారం కనీస వేతన 26,000 ఇవ్వాలని, ఉందని ఆ చట్టాన్ని అమలు చేయాలని వారు సమ్మె చేస్తున్నారని, అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న టిఏ బిల్స్ ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నారనిఆరోపించారు. తక్షణమే టీ ఎ బిల్స్ రిలీజ్ చేయాలని, సంబంధించిన ఐసిడిఎస్ మంత్రి జోక్యం చేసుకోవాలని, అధికారులు ను ప్రభుత్వాన్ని కోరారు. ఈ సిపిఎం మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కల్లూరు ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ నాయకత్వం వహించడం జరిగింది. పి. నాగమణి, బొడ్డు. జ్యోతి,వేమిరెడ్డి. శ్రీదేవి, వాణి శ్రీ, నిర్మల,కృష్ణవేణి,జయమ్మ, రేవతి, సాహితి, కల్పన, కవిత, నవ్య దీపిక, ప్రశాంతి, కరుణకుమారి,యశోద, జీవిత, లక్ష్మి, తదితర యూనియన్ బాధ్యులు నాయకత్వహించారు…

Spread the love