సింబయోసిస్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌ (SET) SCMS పుణే BBA ప్రోగ్రామ్ కోసం తుది పిలుపు

సింబయోసిస్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌ (SET) SCMS పుణే BBA ప్రోగ్రామ్ కోసం తుది పిలుపు

నవతెలంగాణ హైదరాబాద్: సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ)కు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ సింబయోసిస్‌ సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్‌ (SCMS) తమ ప్రతిష్ఠాత్మక  బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (BBA) ప్రోగ్రామ్‌ రిజిస్ట్రేషన్‌ తుది గడువు సమీపిస్తోందని చేరబోయో విద్యార్థులకు గుర్తు చేస్తోంది.  సింబయోసిస్‌ ఎంట్రెన్స్ టెస్ట్ (SET) కోసం అభ్యర్థులు ఏప్రిల్‌ 12, 2025 లోపు రిజిస్టర్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ తుది గడువు సమీపిస్తున్న సందర్భంలో డాక్టర్‌ ఆద్య శర్మ, SCMS పుణే డైరెక్టర్‌ మాట్లాడుతూ, “భవిష్యత్‌ గురించి ఆలోచించే ఈ డైనమిక్‌ వాతావరణంలో చేరాలనుకునే వేలాది మంది విద్యార్థులను  ప్రతీ సంవత్సరం  మేము చూస్తుంటాం.  రిజిస్టర్‌ చేసుకునేందుకు గడువు కొన్ని రోజులే ఉంది కాబట్టి ఈ అవకాశాన్నిఎవరూ కోల్పోకూడదని మేము కోరుకుంటున్నాం” అన్నారు.

SCMS పుణే ప్రతిష్ఠాత్మక BBA ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది తుది అవకాశం. విద్యా శక్తిని ఆచరణాత్మక అనుభవంతో మిళితం చేసి భవిష్యత్‌పై దృష్టి సారించే పాఠ్యాంశాలతో కూడిన అత్యుత్తమ వ్యాపార విద్యకు ఇది ప్రవేశద్వారం.

SCMS పుణేకు ఉన్న ముఖ్యమైన తేడా విద్యార్థులను కెరీర్‌కు సంసిద్ధులుగా చేసి పరిశ్రమకు తగిననట్టు తీర్చిదిద్దే నిబద్ధతతో కూడిన బహుళవిభాగ, సాంకేతిక ఆధారిత, పరిశ్రమ అనుకూలమైన పాఠ్యాంశాలు.  2023–24 ప్లేస్‌మెంట్ సీజన్‌లో విభిన్న రంగాలలోని అగ్రశ్రేణి రిక్రూటర్ల భాగస్వామ్యంతో SCMS పుణే ఆకర్షణీయమైన 96.96% ప్లేస్‌మెంట్ రేటు సాధించింది. అత్యధిక అంతర్జాతీయ ఆఫర్ 17.25 LPA కాగా  అత్యధిక దేశీయ ప్యాకేజీ 12LPAగా నిలిచింది. ఇది SCMS గ్రాడ్యుయేట్లను భారతదేశం,  విదేశాలలో యజమానులు ఎంతగా గౌరవిస్తారో తెలియజెప్తుంది.

భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దేందుకు విభిన్నమై ప్రత్యేకతలు

SCMS పుణే అందించే BBA ప్రోగ్రామ్‌లో ఏడు వైవిధ్య ప్రత్యేకతలతో కూడిన సమగ్ర కరికులం ఉంటుంది:

  • మార్కెటింగ్ మేనేజ్‌మెంట్: పోటీ మార్కెట్లలో నిలదొక్కుకొని ముందుకు సాగే వ్యూహాలు.
  • హ్యుమన్‌ రిసోర్స్ మేనేజ్‌మెంట్: ప్రతిభను ప్రోత్సహించి  సంస్థాగత వృద్ధిని పెంపొందించడం.
  • ఇంటర్నేషనల్‌ బిజినెస్: అంతర్జాతీయ వాణిజ్యం, భిన్న సాంస్కృతిక నిర్వహణ ఆకళింపు.
  • అకౌంటింగ్‌ & ఫైనాన్స్: వ్యూహాత్మక నిర్ణయ శక్తి కోసం ఆర్థిక కౌశల్యం.
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌: సృజనాత్మక ఆలోచన, స్టార్టప్‌ మేనేజ్‌మెంట్‌ను పెంపొందించడం.
  • బిజినెస్‌ అనలిటిక్స్: అవగాహనతో కూడిన వ్యాపార వ్యూహాలకు డేటా ఉపయోగించడం.
  • సస్టెయినబిలిటీ స్టడీస్‌ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్: సుస్థిర వ్యాపారాలను ప్రోత్సహించడం.

క్లాస్‌రూమ్‌కు మించిన సంపూర్ణ అభివృద్ధి

విస్తృత శ్రేణి పాఠ్యేతర, సహ-పాఠ్య కార్యకలాపాలు అందించడం ద్వారా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చని SCMS పుణే విశ్వసిస్తుంది.  సంస్థ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి సిమ్‌పల్స్‌(Sympulse).  ఇందులో విద్యార్థులు పోటీపడుతూ నెట్‌వర్క్, నాయకత్వ నైపుణ్యాలు పెంచుకుంటారు. వివిధ డొమైన్‌లలో విస్తరించి ఉండే 50కి పైగా ఈవెంట్లతో కూడిన సిమ్‌పల్స్ (Sympulse) విద్యార్థుల నైపుణ్యం, సహకారానికి కేంద్రంగా నిలుస్తుంది..

ఇవే కాకుండా పరిశ్రమ ప్రముఖులు, కార్పొరేట్‌ ఇంటర్న్‌షిప్స్‌, గ్లోబల్‌ ఇమర్షన్ ప్రోగ్రామ్‌, ఇంటరాక్టివ్‌ గెస్ట్ లెక్చర్స్‌ వంటి విషయాలకు సంబంధించిన అనుభవాన్ని విద్యార్థులు పొందుతారు. ఇవన్నీ కూడా పాఠ్యాపుస్తకాలకు మించి సమగ్ర అభ్యాస అనుభవంగా నిలుస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తిగల అభ్యర్థులు సింబయోసిస్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ (SET)కు హాజరుకావాల్సి ఉంటుంది, ఇది రెండు తేదీలు మే 5, మే 11, 2025న జరుగుతుంది. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగంగా  పర్సనల్‌ ఇంటరాక్షన్‌ అండ్‌ రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ (PI-WAT) లో పాల్గొనాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు:

  • SET రిజిస్ట్రేషన్‌ ముగింపు: ఏప్రిల్‌ 12, 2025 (శనివారం)
  • SET టెస్ట్ 1 – మే 05, 2025 (సోమవారం)
  • SET టెస్ట్ 2 – మే 11, 2025 (ఆదివారం)
  • SCMS ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ & చెల్లింపు ముగింపు: మే 20, 2025 (మంగళవారం)
  • SET ఫలితం: మే 22, 2025 (గురువారం)
  • SCMS, పుణే షార్ట్‌ లిస్ట్‌ ప్రచురణ తేదీ: మే 28, 2025 (బుధవారం)
  • ఆన్‌లైన్‌ PI తేదీలు: జూన్‌ 3, 2025 (మంగళవారం) నుంచి జూన్‌ 13, 2025 (శుక్రవారం) [జూన్‌ 8, 2025 (ఆదివారం, సెలవు PI ఉండదు)]
Spread the love