ప్రయివేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోండి..

నవతెలంగాణ – ఆర్మూర్ 
ప్రయివేటు స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని టి ఎన్ వి ఎస్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆన్న ప్రవైట్ విద్యాసంస్థలు ప్రభుత్వానికి విరుద్ధంగా అక్రమంగా స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకి వాడుకుంటున్నారు ఫిట్ నెస్ లేకుండా పెళ్లిళ్లకు పార్టీ మీటింగ్ లకి  వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు ఇదే తరహాలో నందిపేట్ లో ఒక హై స్కూల్ యాజమాన్యం వారి పరిమితికి మించి స్కూల్ బస్ నీ పెళ్లికి దాదాపు 60 కిలో మీటర్లు దూరం బస్ నీ పంపించడం ప్రభుత్వ నియమలకి విరుద్ధం అని ఆ పాఠశాల పై చర్యలు  బస్ నీ వెంటనే సీజ్ చెయ్యాలని అన్నారు ఈ సందర్భంగా ఆర్టీవో  సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు.
Spread the love